హైకోర్టు తీర్పుపై 'సుప్రీం'కు సర్కార్!
NEWS Oct 11,2025 11:58 am
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర సర్కార్ డిసైడైనట్లు తెలుస్తోంది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని భావిస్తోంది.