కవిత సమక్షంలో ఎమ్మెల్యే అభ్యర్థులు
NEWS Oct 08,2025 01:06 pm
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జాగృతి ప్రభావం విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో కామారెడ్డి బీఎస్పీ నాయకులు సురేష్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నాయకులు తలారి బాలరాజ్ (బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు) జాగృతిలో చేరారు. జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్ గౌడ్, రాష్ట్ర జాగృతి అధికార ప్రతినిధి నరేష్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.