ట్రంప్ బాగా చేస్తలేడు ఇక్కడికి రండి అవకాశాలు ఇస్తానని మాట్లాడే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఇప్పటివరకు ట్రంప్ మీద మోడీనే ఒక్కమాట మాట్లాడలేదు . ఊర్లో బజారులో కూర్చున్న వాడు ఎవరిని అయినా తిట్టొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి లాగా ఉండి ఏం మాట్లాడాలో సోయి ఉండాలి కదా అని నిలదీశారు. కనీసం 10 సార్లు అమెరికా పోయిన మీ రాహుల్ గాంధీ కూడా ట్రంప్ మీద మాట్లాడ లేదన్నారు.