అబద్దాలు చెప్పడంలో బాబు దిట్ట
NEWS Sep 28,2025 08:08 pm
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం చూస్తే అట్టర్ ప్లాప్ సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేసినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అరకొర హామీలు అమలు చేసి సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని మోసం చేశారన్నారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ప్రచారంతో బతికేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.