రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్
NEWS Sep 20,2025 01:39 pm
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్. తనమీద అక్రమ కేసులు పెట్టడం పట్ల మండిపడ్డారు. కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడినందుకు తనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తమ పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని వార్నింగ్ ఇచ్చారు.