త్వరలోనే పశు వైద్యుల నియామకం
NEWS Sep 19,2025 05:22 pm
ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పార మంత్రి అచ్చెన్నాయుడు. శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పశు సంవర్దక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గత వైసీపీ సర్కార్ పశువైద్యుల నియామక భర్తీని పాతరేసిందని ఆరోపించచారు. గత ఐదేళ్లలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కుంటు పడిందని మండిపడ్డారు. పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు.