హాస్య నటుడు రోబో శంకర్ మృతి
NEWS Sep 19,2025 08:55 am
తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్ను మూశారు. ఆయన వయసు 46 ఏళ్లు. చెన్నైలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తను ఉన్నట్టుండి స్పృహతప్పి పడి పోయారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న అర్ధరాత్రి తను తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తను రోబో లాగా డ్యాన్స్ చేయడంతో రోబో శంకర్ గా గుర్తింపు పొందారు.