పని తీరు బాలేదంటే రాజీనామా చేస్తా
NEWS Sep 18,2025 08:25 am
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై స్పందించారు తీన్మార్ మల్లన్న. తన పదవిపై ప్రజా రిఫరెండం కోరుతున్నానని ప్రకటించారు. ఎమ్మెల్సీగా నేను సరిగ్గా పని చేయలేదని చెబితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీసీ వర్గాల కోసం చట్ట సభలో ఉండి పోరాడాలని చెబితే. ఎమ్మెల్సీగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా అని గతంలో చాలా మంది అన్నారంటూ మండిపడ్డారు.