బుచ్చయ్యపేట ఎం.పి.డీ.ఓ గా శివ ప్రసాద్ నారాయణ
NEWS Sep 17,2025 04:32 pm
బుచ్చయ్యపేట మండలంలో కొత్త అభివృద్ధి అధికారిగా శివ ప్రసాద్ నారాయణ నియమితులై బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎం.పి.డీ.ఓ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.