గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల నిరసన
NEWS Sep 17,2025 04:33 pm
చోడవరం మండలం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు తక్షణం బకాయిలు చెల్లించి, ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 2025–26 క్రషింగ్ సీజన్ తప్పక జరగాలని కోరారు. ఫ్యాక్టరీ నిలిచిపోతే చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో రైతులు, కార్మికుల జీవన పరిస్థితులు కష్టాల్లో పడతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఛలో అసెంబ్లీ, గేటు వద్ద దీక్షలు వంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు తీర్మానించారు.