కొత్తగూడెంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
NEWS Sep 17,2025 04:34 pm
విద్యానగర్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.