కేసీఆర్ ను సీఎం చేస్తే ఆస్తులు పెంచుకున్నారు
NEWS Sep 17,2025 03:09 pm
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్కడినే గులాబీ జెండాను నల్లమలకు మోసుకు వెళ్లానని అన్నారు. కేసీఆర్ ను నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. తన మీద చేస్తున్న ట్రోలింగ్ ను పాజిటివ్ గా తీసుకున్నానని చెప్పారు. ప్రధాని మోదీ కారణ జన్ముడని కితాబు ఇచ్చారు. తన పుట్టిన రోజు సందర్బంగా తొలిసారిగా అచ్చంపేటలో అడుగు పెట్టానని చెప్పారు.