వడ్డాదిలో తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు
NEWS Sep 17,2025 02:03 pm
బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది జంక్షన్ వద్ద వి.ఎస్.ఆర్ పోలి ఆసుపత్రిలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంపూర్ణ శరీర పరీక్షా శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమంలో గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం. సుజిత్ కుమార్ నాయుడు పాల్గొని వైద్య సేవలు అందించనున్నారు. ఈ శిబిరంలో భాగంగా వెలుపల సాధారణంగా ఆరు వేల ఆరు వందల రూపాయల ఖర్చు అయ్యే పరీక్షలు కేవలం మూడు వేల రూపాయలకే అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు . గ్రామీణ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.