రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
NEWS Sep 17,2025 01:41 pm
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.