మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
NEWS Sep 17,2025 01:06 pm
ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించింది మావోయిస్టు పార్టీ. భారత దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషనీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ-మెయిల్, ఫేస్బుక్ ఐడీలను వెల్లడించింది.