నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రమాదం
NEWS Sep 17,2025 12:54 pm
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆయన తన సర్కార్ పై మండిపడ్డారు. నేపాల్ తరహాలో రాష్ట్రంలో యువత తిరగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవన్నారు. వారిని గాలికి వదిలి వేస్తే ప్రమాదం అన్నారు. వారికి సరైన దారి చూపించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు.