హైదరాబాద్ డ్రగ్స్‌కు గేట్ వేగా మారింది
NEWS Sep 17,2025 11:08 am
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు గేట్ వేగా మారిందన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ కట్టడి చర్యలు కొందరికి నచ్చక పోవచ్చన్నారు. డ్రగ్స్, గంజాయి వ్యాపారంలో ఎంత పెద్దోళ్లు ఉన్నా కనికరించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఫాంహౌస్‌లలో గంజాయి పండించి సరఫరా చేస్తే ఊరుకోం అన్నారు. ప్రజలు అండగా ఉంటే మత్తు మాఫియాను తరిమి కొడతామన్నారు.