భాకరాపేట కల్వర్ట్ సమీపంలో బద్వేలు డిపోకు చెందిన ఆర్టీసీ ఆల్ట్రా ఆర్డినరీ బస్సు కడప వైపు వెళ్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలపాలవగా, కండక్టర్ చెయ్యి విరిగింది. బస్సులోని కొంతమంది ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న బేటాలియన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బస్సు అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న ప్రయాణికులను రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రాణనష్టం జరగలేదు.