చోడవరంలోని సీతారామ కాంప్లెక్స్ లోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపారు.