బీఎన్ రోడ్డు బురదలో కూరుకు పోయిన వాహనాలు
NEWS Sep 17,2025 04:36 pm
బీఎన్ రోడ్డులోని బంగారుమెట్ట సమీపంలో వాహనాలు కూరుకు పోయాయి. నర్సీపట్నం నుంచి వడ్డాది వైపు వస్తున్న వ్యాన్, గ్రానైట్ లోడు లారీ బురదలో కూరుకు పోయాయి. రెండు వాహనాలు ఓకే గోతిలో పక్క పక్కనే కూరుకు పోవడంతో ఇతర వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలువురు వాహనదారులు వ్యాన్ను బయటకు లాగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గ్రానైట్ లారీ బుధవారం కూడా అక్కడే ఉండి పోయింది.