ప్రకాశం జిల్లా కొండేపి లో బుధవారం తెల్లవారజాము నుండి ఎడతెరుపు లేని వర్షం కురిసింది. దీంతో కొండేపి లోని పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఎడ తెరుపు లేని వర్షానికి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి కొండేపి వాసులు ఇళ్ళకి పరిమిత మాయ్యారు. అధికారులు మాత్రం పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం గా ఉండాలని సూచించారు.