పీఎంఏవై కింద 40,410 ఇళ్లు మంజూరు
NEWS Sep 17,2025 08:22 am
ఏపీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద రాష్ట్రానికి 40 వేల 410 ఇళ్లను మంజూరు చేసింది. రూ.2.50 లక్షల చొప్పున యూనిట్ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశించింది. రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి స్పష్టం చేసింది.