మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్
NEWS Sep 17,2025 07:08 am
హెచ్ఎండీఏ ఎండీగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ కు మెట్రో రైలు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు ఇప్పటి దాకా ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రెడ్డి గతంలో రిటైర్ అయినా తన పదవీ కాలాన్ని పొడిగించింది. కాగా మెట్రో రైలు హైదరాబాద్ లో ప్రారంభం అయిన నాటి నుండి ఎన్వీఎస్ రెడ్డి ఎండీ గా కొనసాగారు.