ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలు ఇలా..
NEWS Sep 17,2025 04:39 am
సెప్టెంబర్ 17 వేడుక పార్టీలు ఎవరికి నచ్చినట్లు వాళ్లు తమ విధానాలకు తగ్గట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను 'ప్రజా పాలన దినోత్సవం' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు జాతీయ జెండా ఎగురవేయాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వేడుకల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.