రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన శ్రీరామ్
NEWS Sep 16,2025 11:11 pm
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో హై స్కూల్ విద్యార్థి శ్రీరామ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య తో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, చదువుతోపాటు క్రీడలు ఉంటే విజ్ఞానం పొందుతారని అన్నారు. విద్యార్థులు క్రీడలో రాణించే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం విద్యార్థి శ్రీరామ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంజిత్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.