‘ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలి'
NEWS Sep 17,2025 04:43 am
జగిత్యాల: ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. మాలల అస్థిరత్వంపై పోరాటం చేస్తూనే రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నవంబరు 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంజయ్య, రాజు, దేవయ్య, పురుషోత్తం పాల్గొన్నారు.