యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు ప్రోసీడింగ్లు అందజేత
NEWS Sep 17,2025 04:44 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రోసీడింగ్లను అందజేశారు. ఇటీవల జగిత్యాల పట్టణం, పలు మండలాలకు కొత్తగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఆయన ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.