'ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం'
NEWS Sep 17,2025 04:45 am
జగిత్యాల: కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు.