కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ భేటీ
NEWS Sep 17,2025 04:52 am
జగిత్యాల: లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా స్థాయిలో వార్షిక ఋణ ప్రణాళిక (ACP) అమలుపై నివేదికను సమర్పించారు. అన్ని బ్యాంకులు పంట రుణాల రెన్యువల్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.