గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
NEWS Sep 17,2025 04:50 am
జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంగణములో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి సుమారు 200 గ్రాముల బరువు గల గంజాయి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల్లో 1. తిరుపతి కొనసముద్రాల గ్రామం కుమ్మరపల్లి మండలం నిజామాబాద్ జిల్లా. 2. ఇట్టేం రాహుల్ వెలుగొండ, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా. ఇద్దరిపై కేసు నమోదు చేశారు ఎస్సై పి. కరుణాకర్.