జగిత్యాల ఆటో డ్రైవర్ హత్య కేసు
NEWS Sep 16,2025 08:05 pm
జగిత్యాలకు చెందిన ఆటో డ్రైవర్ నహిముద్దీన్ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, బీహార్‌కు చెందిన కూలీలు దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని ఇద్దరు ఆటోను 300లకు అద్దెకు తీసుకోవాలని మాట్లాడుకున్నారు. అద్దె విషయంలో వాగ్వాదం జరగడంతో, నిందితులు నహిముద్దీన్‌ను గుడ్డతో మెడకు ఉరి వేసి, అనంతరం బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.