మర్రిపూడి మండలంలో ‘పొలం పిలుస్తుంది’
NEWS Sep 16,2025 08:03 pm
మర్రిపూడి మండలంలోని చిల్లంకూరు, కాకర్ల గ్రామాలలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి రైతు తమ పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట నమోదు ద్వారా రైతులకు మద్దతు ధర, నష్టపరిహారం, పంట బీమా, సున్నా వడ్డీ రాయితీ వంటి పథకాలు లభిస్తాయని వివరించారు. అలాగే, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వాడకం పెంచాలని సూచించారు.