లక్కవరంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
NEWS Sep 16,2025 08:01 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పథకాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టిడిపి నాయకుడు నాగులపల్లి సూర్యనారాయణ తెలిపారు. రేషన్ డిపోలో నిత్యావసర సరుకులు తీసుకునే వారికి ఏటీఎం తరహాలో డిజిటల్ విధానంలో సులభతరంగా సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. లక్కవరం గ్రామంలో ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ టిడిపి ప్రెసిడెంట్ నాగులపల్లి సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ వబలరెడ్డి శ్రీను, సచివాలయ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.