కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి
NEWS Sep 16,2025 07:59 pm
మల్యాల కేంద్రంలోని కొత్తపేటలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ నుంచి రామడుగు, గంగాధర మీదుగా మల్యాల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్స్ పంచుకుని, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని, కొత్త రహదారి నిర్మాణం వల్ల ప్రజలకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని మండలాధ్యక్షుడు మల్లేశం తెలిపారు. రవి, రమేష్, వెంకటస్వామి, రాములు, రమ, రాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.