నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
NEWS Sep 16,2025 05:26 pm
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు. ఇన్ ఫ్లో: 1 లక్ష 71 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1 లక్షా 31 వేల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు డ్యాం అధికారులు.