రూ. 579 కోట్లతో అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్‌షిప్
NEWS Sep 16,2025 04:51 pm
బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ ను అపోలో టైర్స్ కైవసం చేసుకుందని ప్రకటించింది. గతంలో డ్రీమ్ 11 రూ. 358 కోట్లకు చేజిక్కించు కోగా ఇటీవల కేంద్రం గేమ్స్ సంస్థపై నిషేధం విధించడంతో తప్పుకుంది. దీంతో బిడ్ ను ఆహ్వానించింది. పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు భారీ ధరకు అపోలో టైర్స్ రూ. 579 కోట్లకు చేజిక్కించుకుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం మూడేళ్ల వరకు ఉంటుందని తెలిపింది.