దళారులను నమ్మి మోసపోకండి : తహసిల్దార్ గోపాలకృష్ణ
NEWS Sep 16,2025 05:27 pm
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందిస్తున్నామని తహసిల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థుల, చదువు లేని పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు సర్టిఫికెట్లు చేపిస్తామంటూ మోసం చేస్తే తనకు తెలియజేయాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని , నిర్ణీత తేదీలలోపు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి సర్టిఫికెట్ ఆమోదిస్తామని తెలిపారు. అనంతరం ఆ సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని తెలిపారు. దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోస పోవద్దన్నారు.