ఏపీలో మళ్లీ వర్షాలు
NEWS Sep 16,2025 10:49 pm
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఎవరూ చెట్ల కింద ఉండ వద్దని సూచించారు ఎండీ ప్రఖర్ జైన్.