ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణమే చెల్లించాలి
NEWS Sep 16,2025 02:14 pm
ఏపీ కూటమి సర్కార్ పై మండిపడ్డారు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల. ఆరోగ్యశ్రీని ఆస్పత్రులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడంతో పేదలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రైవేట్ బీమా సంస్థలకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల బీమా సదుపాయం ఇస్తామని ప్రకటించారని, ప్రస్తుతం దానికి మంగళం పాడారంటూ మండిపడ్డారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని, ఆరోగ్యశ్రీని పునరుద్దరించేలా చూడాలన్నారు.