పల్లెల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
NEWS Sep 16,2025 12:47 pm
పల్లెల్లో పరిశుభ్రతపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. వేస్ట్ మేనేజ్‌మెంట్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంగా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ చేపట్టాలన్నారు. మోదీ సూచన మేరకు తానే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చానని చెప్పారు. తన హయాంలోనే హైదరాబాద్‌లో నైట్ క్లీనింగ్ ప్రారంభం అయ్యిందన్నారు. ఏపీలో అన్ని నగరాలు స్వచ్ఛ అవార్డులు సాధించాలన్నారు. ఏళ్లుగా పేరుకు పోయిన చెత్తను జనవరి 1వ తేదీ లోగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.