తెలంగాణ గవర్నర్ పై నారాయణ గరం
NEWS Sep 16,2025 11:42 am
తెలంగాణ గవర్నర్ పై సీపీఐ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొన లేదన్నారు. దేశ స్వతంత్రం కోసం 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని చెప్పారు.