తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
NEWS Sep 16,2025 10:28 am
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు. రూ. 1400 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించక పోవడంతో నిలిపి వేశామని పేర్కొన్నాయి. గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆస్పత్రులకు గత 12 నెలలుగా పెండింగ్‌లో బకాయిలు ఉన్నాయని వాపోయారు.