టమాట రైతులను పట్టించుకోని సర్కార్
NEWS Sep 16,2025 10:08 am
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ సీఎం జగన్ . టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. వైఫల్యం చెందారంటూ చంద్రబాబును ఏకి పారేశారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావంటూ ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా అని ప్రశ్నించారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్న కనికరం చూపించక పోవడం దారుణమన్నారు.