ఫీజు బకాయిలు చెల్లించాలని నిరసన
NEWS Sep 16,2025 10:09 am
కోరుట్ల రామకృష్ణ డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి కళాశాలలో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించక పోవడం వల్ల కళాశాలను నిర్వహించే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.