మళ్లీ పెరుగుతున్న గోదావరి
NEWS Sep 16,2025 10:10 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉదయం 8 గంటలకు 39.60 అడుగుల వద్దకు చేరుకుందని అధికారులు తెలియజేశారు.7,63, 558క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం కొనసాగుతుంది. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక వరకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.