నీటి సమస్యకు పరిష్కారం
NEWS Sep 16,2025 10:12 am
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఎల్బీపీ అగ్రహారం గ్రామం రామాలయం వీధిలో గత కొంత కాలంగా నీటి ఎద్దడి నెలకొంది. దీంతో నీటి కొళాయి తుప్పు పట్టడం వలన తమకు సరిగా నీరందడం లేదంటూ స్థానికులు వాపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే పంచాయతీ కార్యదర్శి పద్మ అక్కడికి చేరుకున్నారు. మరమ్మతులు చేపట్టి నీటి సమస్యకు తెర దించారు. ఈ సందర్బంగా సెక్రటరీకి ధన్యవాదాలు తెలిపారు.