అవార్డు అందుకున్న యువ రైతు
NEWS Sep 16,2025 10:13 am
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువ రైతు బండారు వెంకటేష్ 'అన్నదాతకు ఆత్మీయ సత్కారం' అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జె.డి. లక్ష్మీనారాయణ, నిర్వాహకులు యూత్ ఆఫ్ ఆంటీ కరప్షన్ వారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.