'ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి
NEWS Sep 16,2025 10:14 am
ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్టీలతో కలిసి స్వీకరించారు. ప్రజావాణి కార్య క్రమానికి మొత్తం 31 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని తెలిపారు.