ఎండపల్లి: ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
NEWS Sep 16,2025 05:28 pm
ఉమ్మడి వెల్గటూర్ మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులతో MRO కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచలేదన్నారు. అనంతరం ఎండపల్లి MROకి వినతి పత్రం అందజేశారు. సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.