బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభ
NEWS Sep 16,2025 12:40 pm
జగిత్యాల: బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.